010 Reply to Shri Mukhesh Prasad

Dear friend:

Pl. refer to your comment, reading as under, at my Ayurveda blog:--

sir, plz mail your address,date and time of the fish treatment of asthma.

My reply:- You seem to have misunderstood what I have written at my Ayurveda Blog. నేను నా ఆయుర్వేద బ్లాగ్ లో వ్రాసిన దానిని మీరు సరిగా అర్ధం చేసుకున్నట్లు కనిపించటం లేదు.

నేను మందు కూరిన చేపలను మింగించటం ద్వారా ఆస్తమాను తగ్గించటం అనే సిధ్ధాంతాన్ని నమ్మటం లేదు. కారణాలు. చేప ద్వారా మందును మింగటం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. నేను లేవనెత్తిన ముఖ్యప్రశ్నను మీరు పట్టించుకున్నట్లు లేదు. బత్తిని బ్రదర్స్ పంచి పెట్తున్న మందులో పాదరసం, గంధకం వంటి అపాయకరమైన పదార్ధాలు కలిశాయా లేదా అనేది వారు స్పష్టంగా చెప్పాలి.

పూర్తి మూలికలతో కూడిన అంటే సంపూర్ణ వృక్షాయుర్వేద (అంటే హెర్బల్) చికిత్సను మీరు నిజాయితీ గల బి.ఎ.ఎమ్.ఏస్. అర్హత గల (లేక తత్సమాన ప్రభుత్వ ధృవీకృత అర్హత గల) వైద్యుని వద్ద పొందటం మేలు. మూలికలు చెట్లనుండి వచ్చే ఆకులు, పూలు, కాయలు, కాండం, వేళ్ళు వంటి పదార్ధాలు. కనుక, చాల కొద్ది మూలికలు మాత్రమే ప్రమాదకరమైనవి (జీడి గింజ, నాభి, వంటివి) ఉన్నాయి. కాబట్టి మీరు అలాంటి ప్రమాదకరమైన మూలికలను వదలివేసి ఇతర దినుసులను స్వేఛ్ఛగా వాడుకుంటే, జబ్బు తగ్గినా తగ్గక పోయినా కొత్త జబ్బులు అంటుకోవు. మీరే స్వంతంగా మూలికలను వాడుకున్నా పెద్ద నష్టమేమి ఉండదని నా నమ్మకం.

హోమియో విషయంలో మటుకు ఆ మందుల్లో ఆల్కాహాల్, పంచదార, తప్ప ఇతర ఔషధ పదార్ధాలు ఉండవు కాబట్టి వాటిని వాడటం దండుగ.

ఎలోపతి వైద్యం ఘరానా Corporate వ్యాపారం గా మారిన విషయం మీకు తెలుసు. అయినప్పటికీ, సాధారణ పరిస్థితులలో ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ, మూలికలను వాడుకుంటూ, మధ్య మధ్య అర్హుడైన ఎలోపతి వైద్యుని సంప్రదిస్తే కాలగమనంలో, వ్యాధి ఉపశమిస్తుందని నా అభిప్రాయం.

నా శుభాకాంక్షలతో.

భవదీయుడు

వైబీరావు గాడిద.

Comments

Popular posts from this blog

011 A discussion about the impact of CURD (yogurt) on our body, as per ancient Ancient Indian Native Medical Texts

How far AyurvEdic system of medicine has progressed since Gandhiji's comments of 1942-46?

004 Comments on Hyderabad fish medicine for asthma